క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
AADHAR | క్రెడిట్, డెబిట్ కార్డుల సైజ్‌లో ఉండి పర్స్‌లో పట్టేలా పీవీసీ కార్డును ( ఆధార్ కార్డు ) UIDI అందుబాటులోకి తీసుకొచ్చింది.

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలా దాదాపు అన్ని కార్డులు ఒకే సైజ్‌లో ఉంటాయి. దీనివల్ల వీటిని పర్సులో సులువుగా పెట్టుకోవచ్చు. అదే ఆధార్ కార్డు విషయానికి వస్తే మిగిలిన కార్డులకు భిన్నంగా ఉంటుంది. దీని సైజ్‌లో తేడా ఉండటంతో జేబులో పెట్టుకెళ్లడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న యూఐడీఏ.. ఆధార్ కార్డును కొత్తగా, ఆకర్షణీయ రూపులోకి తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల సైజ్‌లో ఉండి పర్స్‌లో పట్టే విధంగా మార్పులు చేసి పీవీసీ(పాలి వినైల్ క్లోరైడ్) కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు హోలోగ్రామ్ కూడా ఉంటుంది.
కొత్త తరహా పీవీసీ కార్డు కోసం యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పీవీసీ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఈ కొత్త కార్డు కోసం రూ.50 ఛార్జి వసూలు చేస్తారు. మరి యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా పీవీసీ కార్డును ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

– పీవీసీ ఆధార్ కార్డు దరఖాస్తు చేసేందుకు ముందుగా యూఐడీఏఐ వెబ్సైట్(https://uidai.gov.in/) లోకి వెళ్లాలి.
– గెట్ ఆధార్ అనే ఆప్షన్ కింద Order Aadhaar PVC Card అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
– ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
– ఆధార్ నంబర్ లేకుంటే వర్చువల్ ఐడీ లేదా ఎన్రోల్మెంట్ ఐడీని అయినా ఎంటర్ చేయవచ్చు.
– ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి.
– ఒకవేళ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబర్ లింక్ లేకుంటే.. My Mobile number is not registered అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌లో క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
– Send OTPపై క్లిక్ చేయగానే మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
– అప్పుడు ఫొటోతో సహా మన వివరాలు వెబ్సైట్ పేజిపై కనిపిస్తాయి. వాటిని సరిచూసుకున్న తర్వాత Make Paymentపై క్లిక్ చేయాలి.
– పేమెంట్ పేజిలోకి వెళ్తే క్రెడిట్ కార్డు\డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. యూపీఐ ఆప్షన్‌లోకి వెళ్తే.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి.
– పేమెంట్ పూర్తయిన తర్వాత రసీదు కూడా వస్తుంది. అందులోని SRN నంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి.
– పది రోజుల్లో ఆధార్ కార్డులోని అడ్రస్‌కు పీవీసీ కార్డు వెళ్తుంది.
– SRN నంబర్ ఉపయోగించి.. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోని గెట్ ఆధార్ విభాగంలో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

