e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Giant Owl : 150 ఏళ్ల నుంచి క‌నిపించ‌ని ఈ ప‌క్షి తాజాగా కెమెరాకు చిక్కింది.. వైర‌ల్ ఫోటో

Giant Owl : 150 ఏళ్ల నుంచి క‌నిపించ‌ని ఈ ప‌క్షి తాజాగా కెమెరాకు చిక్కింది.. వైర‌ల్ ఫోటో

మ‌న చేతులారా ప‌ర్యావర‌ణాన్ని నాశ‌నం చేస్తున్నాం. అడ‌వుల‌ను న‌రికేస్తున్నాం. దీంతో బయో డైవ‌ర్సిటీ దెబ్బ‌తింటోంది. ర‌కర‌కాల ప‌క్షులు, జంతువులు అంత‌రించి పోతున్నాయి. ఒక‌ప్పుడు ఉన్నన్ని ప‌క్షులు, జంతువులు ఇప్పుడు లేవు. తాజాగా ఓ ప‌క్షి.. క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

150 ఏళ్ల క్రితం క‌నిపించిన పెద్ద గుడ్ల‌గూబ తాజాగా క‌నిపించింది. దాన్ని వెంట‌నే కెమెరాలో బంధించ‌డంతో ఆ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 150 ఏళ్ల క్రితం వ‌ర‌కు క‌నిపించిన షెల్లీ ఈగ‌ల్ జాతికి చెందిన‌ గుడ్ల‌గూబ ఆఫ్రికాలో కనిపించింది. ఇవి వెస్ట‌ర్న్ ఆఫ్రికాలో ఉంటాయి. ఇవి ప్ర‌పంచంలోనే అతి పెద్ద గుడ్ల‌గూబ‌లు. ఇవి 53 నుంచి 61 సెంటీ మీట‌ర్ల పొడ‌వు ఉంటాయి. ఇవి ఆఫ్రికా అడ‌వుల్లో 1870లో క‌నిపించాయి. అప్పటి నుంచి ఇవి క‌నిపించ‌లేదు. దీంతో ఈ జాతి గుడ్ల‌గూబ‌లు అంత‌రించిపోయాయ‌ని అంతా అనుకున్నారు.

- Advertisement -

కానీ.. అక్టోబ‌ర్ 16న లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజీకి చెందిన‌ లైఫ్ సైన్సెస్ ప్రొఫెస‌ర్ జోసెఫ్ తొబియాస్‌, ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త రాబ‌ర్ట్ విలియ‌మ్స్ ఈ ప‌క్షిని ఘ‌నాలోని అటెవా అడ‌విలో గుర్తించారు. దీంతో వెంట‌నే దాన్ని ఫోటో తీశారు.

బైనాక్యుల‌ర్‌లో ఆ గుడ్ల‌గూబ‌ను చూసి షాక్ అయ్యాం. ఎందుకంటే.. ఆఫ్రికాలోని ఏ అడ‌విలో కూడా ఇంత పెద్ద గుడ్ల‌గూబ లేదు. అందుకే వెంట‌నే దాన్ని ఫోటో తీసి.. జూమ్ చేసి చూస్తే అది 150 ఏళ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన షెల్లీ జాతికి చెందిన గుడ్ల‌గూబ‌గా గుర్తించాం.. అని డాక్ట‌ర్ జోసెఫ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్ట‌ర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయ‌కు ఇండియాతో క‌నెక్ష‌న్ ఉంద‌ట‌

Alligator Attacks Man : ఈత కొడుతున్న వ్య‌క్తిపై మొస‌లి దాడి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

Sandwich: బుల్లెట్ బండి మీద శాండ్‌విచ్‌ అమ్ముతున్నాడు.. వీడియో వైర‌ల్‌

Spider inside Woman’s Ear : మ‌హిళ చెవిలో దూరిన సాలీడు..

70 ఏళ్ల వ‌య‌సులో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వృద్ధురాలు..

Viral Video : ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయ‌డానికి క్రేన్‌నే తీసుకొచ్చారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement