పంటపొలాలను జంతువులు, పక్షుల నుంచి రక్షించుకునేందుకు రైతులు పడే పాట్లు మాములుగా ఉండవు. ముఖ్యంగా ప్రస్తుతం కోతులు పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో పంటపొలాలను రక్షించుకునేందుకు రైతుల ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. కోతులతో పాటు పక్షులు, ఇతర జంతువులు పంటలను నాశనం చేసేస్తుంటాయి. 24 గంటలు పంటల వద్ద రైతులు ఉండలేరు కాబట్టి.. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏదో ఒక ఏర్పాటు చేస్తుంటారు. పక్షులను బయపెట్టేందుకు అక్కడ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం, ఎర్రటి రంగు చీరలను కట్టడం చేస్తుంటారు. వాటిని చూసి పక్షులు, జంతువులు బెదిరిపోతాయని రైతుల నమ్మకం.
తాజాగా ఓ రైతు పక్షుల బెడద నుంచి తప్పించుకునేందుకు మంచి ఉపాయం ఆలోచించి.. దాన్ని పంటపొలాల్లో ఏర్పాటు చేశాడు. ఫ్యాన్‌ను ఏర్పాటు చేసి దానికి చైన్‌ను కట్టి.. పక్కనే ఓ స్టీల్ బాక్స్‌ను పెట్టాడు. ఫ్యాన్ తిరుగుతూ దానికి ఉన్న చైన్ కూడా అటూ ఇటూ ఊగుతూ స్టీల్ బాక్స్ మీద పడి టప్.. టప్ అనే సౌండ్ అవుతుంది. ఆ సౌండ్‌కు పక్షులు ఉండకుండా పారిపోతాయని ఆ రైతు చేసిన ఉపాయం వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వావ్.. ఆ రైతు ఉపాయం బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Bhangra Dance : పంజాబీ పాటకు రావణుడి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్
ముంబై, కోల్‌కతా.. ఈ నగరాలన్నీ అమ్మవారి పేరుతోనే వెలిశాయని తెలుసా?
Dussehra | దసరా రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు?
ప్రిన్సిపల్ పోస్టు కోసం కొట్టుకున్నారు.. వీడియో