పాములు అంటేనే కొందరికి హడల్. అవి ఎక్కడుంటే అక్కడి నంచి పారిపోతారు. అటు వైపు కూడా చూడరు. పాములను చూస్తేనే భయంతో పరిగెత్తుతారు. మరి.. ఏకంగా పెద్ద పాము.. ఆరడుగుల కంటే ఎక్కువగా ఉన్న పాము.. ఇంట్లో దూరితే ఇంకేమైనా ఉందా? ఈ ఘటన యూఎస్‌లోని సౌత్ ఫ్లొరిడాలో చోటు చేసుకుంది.
ఇంట్లోకి దూరిన పెద్ద పాము.. ఏకంగా ఇంట్లోని సీలింగ్‌లోకి దూరింది. పాము దూరడం గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. పామును పట్టుకోవడానికి వచ్చిన రెస్క్యూ సిబ్బందినే అటాక్ చేయడానికి పాము ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆ పామును చూసి దడుసుకుంటారు జాగ్రత్త.