Viral Video | బీచ్‌లో భర్తతో పర్ఫెక్ట్ ఫొటో కోసం కోడలికి అత్తామామల సాయం
బీచ్‌లో భర్తతో కలిసి ఫోటో తీసుకునేందుకు కోడలికి సహకరించిన అత్తా మామల వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : బీచ్‌లో భర్తతో కలిసి ఫోటో తీసుకునేందుకు కోడలికి సహకరించిన అత్తా మామల వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోను నటుడు భూషణ్ ప్రధాన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 9 లక్షల మంది వీక్షించారు.
ఈ క్లిప్‌లో తన భర్తతో బీచ్‌లో పర్ఫెక్ట్ ఫొటో తీసుకునేందుకు కోడలుకు వృద్ధ దంపతులు సహకరించిన తీరు ఆకట్టుకుంటుంది. కోడలి దుపట్టాను ఆమె అత్త పట్టుకోగా మామ కెమెరాలో క్లిక్ మనిపించడం కనిపిస్తుంది.
బీచ్‌లో పర్ఫెక్ట్ ఫొటో వచ్చేందుకు కోడలికి సహకరిస్తున్న అత్తామామలను చూస్తుంటే ముచ్చటేస్తుందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ ప్రశంసలు గుప్పించారు. ఓ మైగాడ్ ఇలాంటివి చాలా అరుదని ఓ యూజర్ కామెంట్ చేయగా, సో లవ్లీ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Viral Video | పోలీస్‌కు సెల్యూట్ చేసిన చిన్నారి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

