బుల్డాగ్..పెద్దపెద్ద ఇళ్లల్లో కనిపించే పెంపుడు కుక్కలు. ఇవి చాలా దూకుడుగా కనిపిస్తాయి. ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటాయి. అయితే, ఇందులో అన్ని బుల్‌డాగ్స్ కోపిష్టివి కావు. కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్ బుల్డాగ్లు మాత్రమే కఠినంగా ఉంటాయి. మిగతావి చాలా సెన్సిటివ్. అప్పుడప్పుడూ అవి శాంతంగా కూడా కనిపిస్తాయి. ఓ బుల్డాగ్ నవ్వుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాలో ‘యానిమల్స్ హిలేరియస్’ అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇందులో బుల్డాగ్కు మేకప్ వేస్తుంటారు. ఆ మేకప్ వేసినంత సేపూ ఆ కుక్క నవ్వుతూనే ఉంటుంది. బ్రష్‌తో రాస్తుంటే దాని ముఖం అందమైన చిరునవ్వుతో వెలిగిపోయింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 67వేల లైక్స్ వచ్చాయి. బుల్డాగ్ ఇంత ప్రశాంతంగా ఉండడం ఎప్పుడూ చూడలేదని పలువురు కామెంట్ చేశారు.