Sidharth Shukla : సిద్ధార్థ్ శుక్లా మృతి.. ట్రెండింగ్‌లో ‘బాలికా వధు’ సీరియల్ ఎపిసోడ్ 1157
సిద్ధార్థ్ శుక్లా మృతి.. ట్రెండింగ్‌లో 'బాలికా వధు' సీరియల్ ఎపిసోడ్ 1157 | ఆయన గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఉదయం సిద్ధార్థ్‌కు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ 13 టైటిల్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఉదయం సిద్ధార్థ్‌కు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

శుక్లా.. బిగ్ బాస్‌తో పాటు.. బాలికా వధు సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. పలు రియాల్టీ షోలతో పాటు.. సినిమాల్లోనూ శుక్లా నటించాడు.

అయితే.. ఆయన మరణించాడనే వార్త తెలియగానే.. నెటిజన్లు.. సిద్ధార్థ్ గురించి, ఆయన ఫ్యామిలీ, వైఫ్ గురించి వెతకడం ప్రారంభించారు. అలాగే.. బాలికా వధు సీరియల్ గురించి నెట్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో బాలికా వధు సీరియల్ 1157 వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆ ఎపిసోడ్లో సిద్ధార్థ్, తన కోస్టార్ ప్రత్యూషా బెనర్జీ కలిసి.. సీరియల్లో నటించిన పెళ్లి సీన్ అది. వాళ్ల పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వీడియో కావడం.. వాళ్లు పెళ్లి డ్రెస్సుల్లో సూపర్బ్‌గా సెట్ అవడంతో.. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ వైరల్ అవుతోంది.

అయితే.. బాలికా వధు అనే సీరియల్లో తనతో పాటు నటించిన కోస్టార్ ప్రత్యూష 2016లో సూసైడ్ చేసుకుంది. తన క్యారెక్టర్ పేరు ఆనంది, సిద్ధార్థ్ పేరు శివ్. ఆ జంటను చూసి టీవీ ప్రేక్షకులు తెగ మురిసిపోయేవారు.

చాలామంది నెటిజన్లు సిద్ధార్థ్ మ్యారేజ్, వైఫ్ గురించి సెర్చ్ చేయడంతో.. ఆ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. అలాగే.. బిగ్ బాస్ 13లో తనతో పాటు పార్టిసిపేట్ చేసిన షెహ్నాజ్ గిల్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎందుకంటే.. బిగ్ బాస్ 13లో సిద్ధార్థ్, షెహ్నాజ్.. ఇద్దరూ క్లోజ్‌గా ఉండేవారు. బిగ్ బాస్ కంటే ముందు కూడా వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : ప్రఖ్యాత టీవీ నటుడు సిద్ధార్థ శుక్లా మృతి
Drugs Case: మీడియా అత్సుత్సాహం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్న 7/జీ బ్యూటీ
Nayanthara: విఘ్నేష్ శివన్..నయనతారని ప్రేమగా ఏ పేరుతో పిలుస్తాడో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

