యాంకర్ వర్షిణి తెలుసు కదా. తెలుగు యాంకర్. తన అందం, అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మోడల్ రంగం నుంచి తెలుగు బుల్లితెరకు వచ్చి పలు సూపర్ హిట్ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.
యాంకర్ వర్షిణికి బిగ్ బాస్ 5లోకి ఎంట్రీ ఇస్తోందని ప్రస్తుతం ఫిలింనగర్లో ఇదే టాక్ వినిపిస్తోంది. స్టార్‌మాలో వచ్చే కామెడీ స్టార్స్ షోకు వర్షిణి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటుంది. తాజాగా యాంకర్ వర్షిణి.. హుషారుగా డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. జీన్స్, టీషర్ట్ వేసుకొని తను చేసిన డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు నెటిజన్లు అయితే.. తను డ్యాన్స్ చేస్తుంటే పొట్ట బయటికి రావడం చూసి… పొట్ట తగ్గించు ముందు, పొట్ట వస్తుంది పాప నీకు.. అంటూ కౌంటర్లు ఇచ్చారు. ఏది ఏమైనా.. వర్షిణి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.