ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు చాలా కొత్తగా, ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఆయన ఏ వీడియో షేర్ చేసినా.. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది. అందుకే.. సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన ఏదైనా ట్వీట్ చేస్తే చాలు.. వీడియో పెడితే చాలు.. ఆ ట్వీట్‌ను క్షణాల్లో వైరల్ చేసేస్తారు నెటిజన్లు.
తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ దోశ బండి దగ్గర దోశలు వేసే వ్యక్తి స్కిల్ గురించి చెప్పుకొచ్చారు ఆనంద్.
ఆ వీడియోలో దోశ వేసే వ్యక్తి.. చాలా ఫాస్ట్‌గా దోశలు వేస్తుంటాడు. దోశలు ఎంత ఫాస్ట్‌గా అంటే.. అటు చూసి ఇటు చూసేలోపు.. దోశలు ప్లేట్లో పడిపోతున్నాయి. ఆ వీడియోకు ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా.. నీ స్కిల్ ముందు రోబోలు ఏం పనిచేస్తాయి. వాటికన్నా స్పీడ్‌గా పనిచేసి వాటి పనిని స్లో చేశావు. ఆయన పనిని చూసి నేనే అలసిపోయా.. కానీ.. అతడు ఎంతో ఉత్సాహంతో దోశలు వేస్తున్నాడు. ఆయన దోశలను చూసి నాకు కూడా ఆకలివేస్తోంది.. అంటూ ట్వీట్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
ప్రస్తుతం ఆ వీడియోకు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొంతమంది నెటిజన్లు.. ఆ వీడియోను చూసి.. ఆ దోశ బండి ముంబైలోని దాదర్‌లో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
This gentleman makes robots look like unproductive slowpokes… I’m tired just watching him…and hungry, of course.. pic.twitter.com/VmdzZDMiOk
— anand mahindra (@anandmahindra) August 17, 2021