Hyderabad to Andaman Tour | సమ్మర్లో అండమాన్ ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
IRCTC Andaman Tour | వేసవి సెలవులొచ్చాయంటే.. కొందరు పల్లెటూర్లకు పయనమవుతున్నారు. ఇంకొందరు టూర్లు ప్లాన్ చేసుకొని హాయిగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ మండే ఎండల్లో అండమాన్ టూర్(Andaman Nicobar Islands)కు వెళ్లాలనుకునే పర్యటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది
IRCTC Hyderabad to Andaman Tour | అండమాన్ నికోబార్ దీవులు (Andaman Nicobar Islands) దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లను చూడాలని.. అక్కడికి వెళ్లాలని చాలా మంది ఆశ పడుతుంటారు. అందులోనూ ఈ అందాలను చూడటానికి విమానంలో జర్నీ అంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. అయితే ఈ మండు వేసవిలో అండమాన్ టూర్‌కు వెళ్లాలనుకునే పర్యటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ (AMAZING ANDAMAN EX HYDERABAD ) పేరిట ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ (AMAZING ANDAMAN EX HYDERABAD) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రస్తుతం ఈ టూర్ మే 26వ తేదీన అందుబాటులో ఉంది.. ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్ (PORT Blair), సెల్యూలార్ జైల్(Cellular Jail), హావ్లాక్ ఐలాండ్ (Havelock Island), రాధానగర్ బీచ్ (RAdhanagar Beach), నీల్ ఐలాండ్ (Neil Island) లాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ అండమాన్ ప్రయాణం ఇలా..
Hyderabad-Port Blair
Day 1: మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 06.35 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు(HYD RGIA)లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 09.15 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌కు వెళతారు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.
Port Blair – Havelock Island
Day 2 : రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి.. హావ్లాక్ ఐలాండ్(Havelock Island)కు వెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత… రాధానగర్ బీచ్ చూస్తారు. రాత్రి హావ్లాక్లోనే బస ఉంటుంది.

Havelock Island – Neil Island
Day 3: మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్ చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ఐలాండ్‌లోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.
Neil Island – Port Blair
Day 4: నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత భరత్పూర్ బీచ్ సందర్శన ఉంటుంది. అనంతరం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
Ross & North Bay Island Tour
Day 5: ఐదో రోజు అల్పాహారం చేసి రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
Day 6: ఆరో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంతరం పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉదయం 07:55 గంటలకు హైదరాబాద్ వెళ్లే విమానం ఉంటుంది. 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.55,780 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.43,170, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.42,885 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA18
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

