Hyderabad to Araku Tour | 7 వేలకే అరకు ట్రిప్.. తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
Hyderabad to Araku Tour | సెలవులొచ్చాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్ని ఎండలుంటే ఏంటి సమ్మర్ టూర్లు వేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా! అయితే ఈ వేసవిలో ఆంధ్రా ఊటీ అరకుకు వెళ్లాలనుకుంటున్నారా.? అయితే మీకోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
Hyderabad to Araku Tour | వేసవికాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వేడికి ఇంటినుంచి బయటకు రాలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే ఈ వేసవిలో ఆంధ్రా ఊటీ అరకుకు వెళ్లాలనుకుంటున్నారా.! అయితే మీకోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అరకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
హైదరాబాద్ టూ అరకు (Hyderabad to Araku Tour Package) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి గురువారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో కైలాసగిరి (Kailasagiri), వైజాగ్ బీచ్ (Vizag beach), సింహాచలం (Simhachalam), రుషికొండ (RushiKonda), సబ్‌మెరైన్ మ్యూజియం (Submarine museam) ట్రైబల్ మ్యూజియం (Tribal Museam), అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ (Ananthagiri Plantation), బొర్రా గుహలు (Borra caves), అన్నవరం (Annavaram) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 4 రాత్రులు, 5 రోజులు కొనసాగుతుంది. ప్రతి గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ నుంచి అరకుకు బస్సు అందుబాటులో ఉంది.
ప్రయాణం సాగుతుంది ఇలా
Day 01: మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పర్యాటక భవన్ నుంచి లేదా బషీర్‌బాగ్ నుంచి (6:30 గంటలకు) బస్సు బయలుదేరుతుంది. . రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది. (రాత్రి భోజనం ఉంటుంది)
Day 02: రెండో రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నంలోని ప్రైవేట్ హోటల్ చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం ఉదయం 10.00 గంటల నుంచి కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్‌ల సందర్శన ఉంటుంది. తర్వాత రాత్రి భోజనం, హోటల్లో బస ఉంటుంది.
Day 03: మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అరకు తీసుకెళ్లి ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రాగుహలు, ధింసా డ్యాన్స్ చూపిస్తారు.
అదే రోజు సాయంత్రం సొంత ఖర్చుతో క్రూజ్ బోట్లో జర్నీఉంటుంది( ఒక్కొక్కరికి రూ.500). తర్వాత తిరిగి హోటల్ కి చేరుకుంటారు.
Day 04: నాలుగో రోజు ఉదయం అరకు నుంచి బయలుదేరి అన్నవరం ఆలయాన్ని సందర్శించి అన్నవరం నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
Day 05 : ఐదోరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ అరకు టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Araku Tour cost | పెద్దలకు రూ.6999, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.5,599 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, దర్శనం, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. telangana tourism క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://tourism.telangana.gov.in/package/ArakuTour
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

