160 అడుగుల ఎత్తులో కూర్చొని గోవా అందాలు చూస్తూ లంచ్ చేయాలని ఉందా?
Sky Dining Restaurant in Goa | గోవా అనగానే అందమైన బీచ్‌లు, సముద్రం, పచ్చని పరిసరాలు గుర్తొస్తాయి. ఆ ప్రకృతిని పూర్తిగా తిలకించాలంటే కాస్త ఎత్తయిన ప్రదేశానికి వెళ్లాల్సిందే. అంతెత్తు మీదినుంచి అందాలను ఆస్వాదిస్తూ.. పన్లో పనిగా విందులనూ ఆరగిస్తే – డబుల్ ధమాకా! అడ్వెంచర్‌ను, ఆహారాన్ని కలగలిపి ‘స్కై రెస్టారెంట్’ పేరుతో ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపింది గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్.

అందమైన బాంబోలిమ్ బే బీచ్ పరిసరాల్లో ఉన్న ఈ హోటల్ 160 అడుగుల ఎత్తులో విందారగించేలా ఓ స్కై డైనింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేసింది. సముద్రంలో ఎగసిపడే అలలను చూస్తూ నచ్చిన రుచులను ఆరగించవచ్చు. ఒకేసారి 24 మంది కూర్చుని తినగలిగే ఈ టేబుల్‌ను కుటుంబం కోసం ప్రత్యేకంగానూ బుక్ చేసుకోవచ్చు. టేబుల్ మధ్యలో నిలబడిన వెయిటర్లు రకరకాల రుచులను వడ్డిస్తారు. మంచి సంగీతాన్ని వినిపించడంతో పాటు మీరు తింటున్నంత సేపూ రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్ కూడా ఉంటాడు. బ్రేక్‌ఫాస్ట్, టీ, కాఫీ, లంచ్, డిన్నర్ సర్వ్ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అయితే.. 45 నిమిషాలు, డిన్నర్ అయితే 60 నిమిషాలపాటు ఈ టేబుల్‌పై కూర్చుని గోవా అందాలను వీక్షించవచ్చు. పన్నెండు సంవత్సరాలు దాటినవారికే ఈ స్కై రెస్టారెంట్లోకి అనుమతి ఉంటుంది. ఒకరికి రూ. 3,000 (బ్రేక్‌ఫాస్ట్+టీ) , రూ. 4,500(భోజనం+ ఇతర సౌకర్యాలు).


Read More :
“ఆకాశంలోనే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, థియేటర్లు.. మీకు వెళ్లాలని ఉందా”
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

