NRC: దేశవ్యాప్త ఎన్నార్సీపై నిర్ణయం తీసుకోలేదు.. రోహింగ్యాలను గుర్తిస్తున్నాం!
దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ( NRC ) సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబంధనలు రూపొందించడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరినట్లు గత నెల పార్లమెంట్‌కు చెప్పింది హోంశాఖ.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ( NRC ) సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబంధనలు రూపొందించడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరినట్లు గత నెల పార్లమెంట్‌కు చెప్పింది హోంశాఖ. వచ్చే ఏడాది జనవరి 9 వరకూ దీనికి సమయం ఉంది. ఇక మరోవైపు దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడున్నట్లు వస్తున్న రిపోర్టుల గురించి కూడా హోంశాఖ లోక్‌సభకు వివరించింది.
దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. దేశంలోకి అక్రమంగా చొరబడిన వాళ్లను గుర్తించడం, వాళ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం, వాళ్లు బయోగ్రఫిక్, బయోమెట్రిక్ వివరాలను సేకరించడం, వాళ్ల దగ్గర ఉన్న నకిలీ భారత ధృవపత్రాలను రద్దు చేయడం, వాళ్లను దేశం నుంచి పంపించేయడంపై సూచనలు చేసినట్లు హోంశాఖ తెలిపింది. అక్రమ వలసదారుల బయోగ్రఫిక్, బయోమెట్రిక్ వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు, వాళ్లను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలిసారి హోంశాఖ వెల్లడించింది.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

