వర్సిటీలకు కొత్త కళ
- వీసీల రాకతో మారనున్న పరిస్థితులు
- ఆచార్యుల భర్తీ తదితరాల్లో ముందడుగు

హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): వీసీల రాకతో యూనివర్సిటీలు కొత్తకళను సంతరించుకొంటున్నాయి. యూనివర్సిటీల్లో నెలకొన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్తబ్దతకు తెరపడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకంలో ప్రభుత్వం అనుభవం, సమర్థతకు పెద్దపీట వేసింది. దాంతో వర్సిటీలు కొత్తపుంతలు తొక్కనున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులే వీసీలుగా ఉన్నారు. వీరు రెండుమూడు పోస్టుల్లో ఉండటంతో వర్సిటీల పరిపాలనలో స్తబ్దత నెలకొన్నది. కొత్త వీసీల రాకతో ఆ పరిస్థితుల్లో మార్పులు రానున్నాయి. వర్సిటీల్లోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వీటికి పరిష్కారాలు దొరికే చాన్స్
- ఏటా జారీ చేయాల్సిన పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఇప్పుడు మూడేండ్లకోసారి జారీచేస్తున్నారు. ఎంసెట్, సీపీగెట్ తరహాలో అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నది. దీనిపై వీసీలంతా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
- వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం కానున్నది. గతంలోనే 1,061 ఆచార్యుల పోస్టులను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్న ప్రతిపాదన ఉన్నది. దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటే భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
- తెలుగు యూనివర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు రాష్ట్ర విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉన్నాయి. వీటి విభజన, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల సమస్యలకు పరిష్కారం లభించనున్నది.
- నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌ను బాచుపల్లిలోని నూతన క్యాంపస్‌కు తరలించాలనే ప్రతిపాదన ఉన్నది. బాచుపల్లిలో 100 ఎకరాల స్థలం ఉండగా, అకడమిక్ బ్లాక్, గ్రంథాలయం, హాస్టళ్లు నిర్మించారు. చాలాకాలంగా యూనివర్సిటీని అక్కడికి తరలించాలని ప్రయత్నిస్తున్నా సాధ్యపడటంలేదు. పైగా సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్న అంశం ప్రతిపాదనగానే మిగిలింది. కొత్త వీసీ రాకతో ఇవి పరిష్కారమవుతాయన్న అంచనాలున్నాయి.
- ఉస్మానియాలో హాస్టళ్లు సరిపోవడంలేదు. ఉన్నవి శిథిలావస్థకు చేరాయి. కొత్తవి నిర్మించాల్సి ఉన్నది. పైగా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీలా ఇతరులు ప్రవేశించకుండా క్లోజ్డ్ యూనివర్సిటీగా మార్చాలన్న ఆలోచన సైతం కార్యరూపం దాల్చే అవకాశముంది.
బాధ్యతలు స్వీకరించిన నలుగురు వీసీలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్తగా నియమితులైన వైస్చాన్స్లర్లలో పలువురు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. ఇక ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వీసీలు డీ రవీందర్‌యాదవ్, సీహెచ్ గోపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శాతవాహన, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏయూ, తెలంగాణ యూనివర్సిటీవీసీలు సైతం సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
పాలమూరు వర్సిటీ వీసీకి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు

పాలమూరు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మికాంత్ రాథోడ్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం అభినందించారు. సీఎం కేసీఆర్ ఎంతోనమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీని అన్నివిధాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతీ విద్యార్థిని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది రాష్ర్టానికి, యూనివర్సిటీకి మంచి పేరు తేవాలని సూచించారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

