దళిత బంధు ఎంతో గొప్పది
- జీవితాలు మార్చే పథకం ఇది
- పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదుగుతారు
- కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ప్రశంసలు
- పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని వెల్లడి
- రాజకీయాలు చేయొద్దని అన్ని పార్టీలకు హితవు

హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు ఎంతో గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. పథకం అమలుతో దళితుల జీవితాలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహంలేదని పేర్కొన్నారు. దళిత బంధు అమలులో సీఎం కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. దళిత బంధు విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్ని పార్టీలకు హితవుపలికారు.
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తూ.. ప్రతి దళిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలని కోరారు. ఇంటి కి రూ.10 లక్షలు ఇచ్చేది సోమరిపోతులు కావాలని కాదని, ఈ పథకం అమలు వెనుక మంచిఉద్దేశం ఉన్నదన్నారు. ఎవరి అనుభవానికి తగ్గట్టు వారు ఈ డబ్బును ఉపయోగించుకుంటే దళితుల్లో పేదరికం అంతరిస్తుందని తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించి.. వారు బతకడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదుగుతారని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. మాట ప్రకారం దళితుల ఉన్నతికి మేలైన పథకం అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

