జగిత్యాల రూరల్, ఏప్రిల్ 2 : పోలీసు ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెం దిన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునుగురి పవన్ (26) ఇంటర్ పూర్తి చేశాడు.
నాలుగేండ్ల క్రితం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడంలేదని తీవ్ర మస్తాపం చెందిన పవన్ ఇంట్లో సూసైడ్ నోట్ రాసి, గదిలో ఉరేసుకున్నాడు. తండ్రి లింగయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.