మీ వాణిజ్య విధానాలు బాగున్నాయి
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానాలు, వాటి అమలు పారదర్శకంగా ఉన్నాయని అస్సాం వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది.
- అస్సాం అధికారుల బృందం కితాబు
- సీఎస్ సోమేశ్‌కుమార్‌తో భేటీ
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానాలు, వాటి అమలు పారదర్శకంగా ఉన్నాయని అస్సాం వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విభాగం తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు అస్సాం అధికారుల బృందం శనివారం హైదరాబాద్ చేరుకొని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖలో తీసుకొచ్చిన మార్పులు, నూతన సంస్కరణలను సీఎస్ వివరించారు. పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని, వ్యవస్థీకృత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించినట్టు చెప్పారు. మ్యాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్‌లకు స్వస్తి చెప్పామని, శాఖాపరంగా కొత్త యాప్‌లు, మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేశామని అన్నారు. కొత్త సరిళ్ల ఏర్పాటు ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించామని, పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెడుతామని అస్సాం అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారిప్రసాద్, అదనపు కమిషనర్ సాయికిశోర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

