Missing | అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం ..తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి యువతి ఆచూకీని కనిపెట్టారు.
కారేపల్లి,ఆగస్టు 24: మూడు నెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి యువతి ఆచూకీని కనిపెట్టారు. దాదాపు మూడు నెలల పాటు ఇంట్లో నుండి కనిపించకుండా పోయినఆ యువతిని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి యువతిని మోసం చేసిన హైదరాబాదుకు చెందిన రుకుమ్ అనే యువకుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
కారేపల్లి ఎస్ఐ బైరు గోపి తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లి మండల పరిధిలోని బల్లునగర్ తండాకు చెందిన తల్లిదండ్రులు తన కూతురు అదృశ్యమైనట్లు ఈ ఏడాది మే నెలలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి ఫోన్ వెంట తీసుకువెళ్లకపోవడంతో ట్రేస్ చేయడం ఇబ్బందిగా మారి ఆచూకీ కనిపెట్టేందుకు కొంత ఆలస్యమైందన్నారు. దీంతో ఆధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి యువతి ఆచూకీని గుర్తించినట్టు ఎస్ై పేర్కొన్నారు.పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని, యువతిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

