ఇకపై ఏటా 500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య
అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు.
హైదరాబాద్ : అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన చాంబర్లో మంత్రిగా శనివారం ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి కల్పించే యూనిట్ల మంజూరు, అదేవిధంగా దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా 2367 మందికి 3.50 కోట్లను పంపిణీ చేసే ఫైలుపై సంతకం చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఏటా 210 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యా అభ్యాసానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల సంఖ్యను 500 లకు పెంచారు.
అందుకు సంబంధించిన ఫైలుపై కూడా మంత్రి సంతకం చేశారు. అదేవిధంగా మేడారం జాతరలో ఏర్పాట్లకు సంబంధించిన రూ.45 కోట్ల పనులకు, రూ.79.61 కోట్లతో గిరిజన విద్యాలయాల మరమ్మతు పనులకు, మినీ గురుకులాల నిర్వహణకు 17.18 కోట్లను, అదేవిధంగా ఐఐటీ, నీట్లో ర్యాంకులను సాధించిన 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు ఆమోదం తెలిపారు. అనుమతులు మంజూరు చేశారు.
బాధ్యతలను స్వీకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, సంజయ్‌కుమార్, ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

