న్యూశాయంపేట, జూన్ 6 : ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా ఇంగ్లిష్ రావాలని, ఇంగ్లిష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. సోమవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్లో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్, మేధా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈజీ ఇంగ్లిష్ ఉచిత శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, చైతన్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీ దామోదర్, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ.. సబ్జెక్టులో బేసిక్స్ ముఖ్యమని, ఇష్టంతో చదవితే సులువుగా ఉంటుందని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. యువత ప్రభుత్వ, ప్రైవెట్ రంగాలల్లో మెరుగైన అవకాశాల కోసం ఇంగ్లిష్ ముఖ్యమని తెలిపారు.