హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్‌సీటీపీసీ డ్రైవ ర్, మెకానిక్ ఉద్యోగాలకు ఏప్రిల్ 2న నిర్వహించే రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలంగా ణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండ లి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు డ్రైవర్ పోస్టులకు, మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెకానిక్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను https://www.tslprb.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో అతికించాలని తెలిపారు.