Gold | తులం బంగారం ఎప్పుడిస్తారు..? కాంగ్రెస్ నేతలను నిలదీసిన మహిళ..
‘కల్యాణలక్ష్మి చె క్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను ఓ మహిళ ప్రశ్నించిన పరిణామం ఖమ్మం జిల్లాలో మం గళవారం చోటుచేసుకుంది.
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో వైరా ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళ
కొణిజర్ల, నవంబర్ 26: ‘కల్యాణలక్ష్మి చె క్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను ఓ మహిళ ప్రశ్నించిన పరిణామం ఖమ్మం జిల్లాలో మం గళవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాం దాస్‌నాయక్ హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారురాలి బంధువైన స్థానిక మహిళ చింతల నారాయణమ్మ ‘మీరు అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారంఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చా రు కదా? మరి ఎప్పుడు అందజేస్తారు?’ అం టూ ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు.. వెంటనే సదరు మహిళను వారించారు. ఎమ్మెల్యే బదులిస్తూ.. ‘ప్రస్తుతం లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను అధిగమిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని అన్నారు. మొదటి ప్రాధాన్యంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని, త్వరలోనే తులం బంగారం ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాధానమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

