Home
Telangana
Will Provide Funds After Central Teams Visit Rain Hit Telangana Says Union Minister Kishan Reddy
జాతీయ విపత్తుగా ప్రకటించలేం : కిషన్రెడ్డి
కేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వరదలతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.3 లక్షలు వస్తాయని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన రూ.5 లక్షల పరిహారంలో కేంద్ర నిధులు కలుపుకొంటారా? లేదా ? అనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.1300 కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే ఆ డబ్బులతో బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

