జన్నారం, సెప్టెంబర్ 6: అడవుల్లో గడ్డి క్షేత్రాలు అధికంగా ఉంటే.. వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతుందని గడ్డి క్షేత్ర నిపుణుడు డాక్టర్ మురాత్కర్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారంలోని అటవీశాఖ కమ్యూనిటీ హాల్లో జరిగిన 5 జిల్లాల అటవీ శాఖ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం కవ్వాల్ టైగర్ రిజర్వులోని తాళ్లపేట రేంజ్ పరిధి మల్యాల అడవుల్లోని జింకల పునరుత్పత్తి కేంద్రంలో పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ లోకేశ్‌జైస్వాల్, కవ్వాల్ టైగర్ రిజర్వుడు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి చుక్కల జింకలను వదిలి పునరుత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అలీనగర్ బీట్‌లోని మూసిక జింకల పునరుత్పత్తి కేంద్రంలో మూసిక జింకలను వదిలారు.