Harish Rao | గురుకులాలంటే ఎందుకంత చిన్నచూపు.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు అన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు అన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి అని హరీశ్‌రావు విమర్శించారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించమని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నేనే ఇకనుంచి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయయని అన్నారు.
కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని హరీశ్‌రావు విమర్శించారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024 కి పెంచిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. గురుకులాల్లో లక్ష 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను కేసీఆర్ అందించారని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన కేసీఆర్ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని అన్నారు. ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనమని పేర్కొన్నారు.
గురుకులాలంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గాడిదప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించమని సూచించారు. తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. 2500 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Gurukul
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

