హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ల్లో పనిచేస్తున్న వొకేషనల్ ట్రైనర్లను పునర్నియమింయచాలని ట్రైనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు రీ ఎంగేజ్ ఉత్తర్వులు విడుదల చేయకపోవడంతో అనిశ్చితి నెలకొన్నదని వివరించారు.
రాష్ట్రంలో గురుకులాలు, కేజీబీవీలు, మాడల్స్కూళ్లు, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో 1,900 మంది వరకు వొకేషనల్ ట్రైనర్లు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ముగింపు సమయంలో తొలగించి, రెండు మూడు రోజులు వ్యవధి ఇచ్చి మళ్లీ రీ ఎంగేజ్ చేస్తారు. ఈ ఏడాది ఇంతవరకు రీ ఎంగేజ్మెంట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడలేదు. కొన్ని ఏజెన్సీలు సకాలంలో జీతాలు చెల్లించకుండా శిక్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు.