SIR | ‘సర్’ అప్లికేషన్ పేరుతో మోసం.. మూడు తులాల పుస్తెలతాడు అపహరణ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు.
బీబీనగర్, జూలై 12 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు ఓ మహిళకు చెందిన సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బీబీనగర్ పట్టణానికి చెందిన కుక్కుదోవు అండాలు వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ప్రభుత్వ ‘సర్’ అప్లికేషన్ కోసం ఫొటో తీస్తామని చెప్పి, ఫొటోలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెడలో ఉన్న పుస్తెలతాడును తీసి భర్తకు ఇవ్వాలని సూచించారు.
వారి మాటలు నమ్మిన మహిళ పుస్తెలతాడును తీసి తన భర్త చేతికి ఇచ్చింది. అనంతరం మహిళను ఫొటో తీసిన దుండగులు, అప్లికేషన్‌ను సమీపంలోని ఆలయం వద్ద ఉన్న అధికారుల వద్ద పూర్తి చేయాలని చెప్పి ఆమెను అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. ఇదే సమయంలో వెనక్కి తిరిగిన దుండగులు ద్విచక్ర వాహనంపై మహిళ భర్త వద్దకు చేరుకుని అతని చేతిలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
BJP MLA Tofazzal Hossain | ప్రజల జీవనశైలిపై బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు.. వెల్లువెత్తిన విమర్శలు
‘వారసత్వ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

