హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ యూనిట్లో ఒక వెబ్సైట్ను రూపొందించేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. నూతనంగా రూపొందించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ (http://warangalpolice.telangana.gov.in)ను గురువారం వర్చువల్ పద్ధతిలో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. తాను చూసిన ఉత్తమ పోలీస్ వెబ్సైట్లలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ ఒకటని తెలిపారు. ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరిచారని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతున్నదని తెలిపారు. వైబ్సైట్ కోసం కృషి చేసిన కమిషనర్ డాక్టర్ తరుణ్జోషితో పాటు ఐటీకోర్ ఆధికారులు, సిబ్బంది, వెబ్సైట్ డిజైన్ చేసిన ఎక్స్లెంట్ సంస్థ సీఈవో సూర్యను డీజీపీ అభినందించారు.