ఓటర్లు ఆందోళన చెందొద్దు
ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ‘సర్' కార్యక్రమ ముఖ్యఉద్దేశమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ ట్రైనింగ్ నోడల్ అధికారి బోయపాటి చెన్నయ్య పునరుద్ఘాటించారు.
- అర్హుల ఓట్లను తొలగించం
- సీఈవో కార్యాలయ ట్రైనింగ్ నోడల్ అధికారి చెన్నయ్య
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ‘సర్’ కార్యక్రమ ముఖ్యఉద్దేశమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ ట్రైనింగ్ నోడల్ అధికారి బోయపాటి చెన్నయ్య పునరుద్ఘాటించారు. ఒకవేళ 2002 ఓటర్ల జాబితాలో మీ పేరుగానీ, మీ తల్లిదండ్రులు/తాత, అవ్వల పేర్లుగానీ లేకపోయినా.. లేదా వెతికినా దొరుకకపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వచ్చి ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారమ్‌లోని పాత వివరాల కాలమ్‌ను ఖాళీగా వదిలేసి, ప్రస్తుత మీ వివరాలను మాత్రమే నమోదు చేసి సంతకం చేయవచ్చని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ప్రక్రియపై ఓటర్లలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ చెన్నయ్య తాజాగా వివిధ మాధ్యమాల్లో, ఇంటర్వ్యూలలో కీలక వివరణలు ఇచ్చారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లను వెతుకోవడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్ (ceotelangana.nic.in) లేదా కేంద్ర ఓటర్ల పోర్టల్ (voters.eci.gov.in)లో సెర్చ్ ఆప్షన్ అందుబాటులో ఉంచినట్టు చెన్నయ్య చెప్పారు. ప్రతి ఇంటినీ బీఎల్వోలు కనీసం మూడుసార్లు సందర్శిస్తారని, మొదటిసారి ఎన్యుమరేషన్ ఫారమ్ ఇవ్వడానికి, రెండోసారి పూరించడంలో సహాయం చేయడానికి, మూడోసారి పూర్తిచేసిన ఫారమ్‌ను సేకరించడానికి వస్తారని చెప్పారు. బీఎల్వోలు వచ్చినప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటే, వారు ఆ ఫారమ్‌ను ఇంటి ముందే ఉంచి వెళ్తారని, వారం రోజుల తర్వాత వచ్చి సేకరిస్తారని పేర్కొన్నారు.
24 వరకు అందుబాటులో లేనివారికి కూడా అవకాశం
ఈ నెల 24వ తేదీ వరకు అందుబాటులో లేని వారికి ఓటు నమోదుకు అవకాశం ఉంటుందని చెన్నయ్య స్పష్టంచేశారు. ఉద్యోగ రీత్యా, ప్రయాణాలు లేదా అనారోగ్యం వల్ల బీఎల్వోలకు ఫారమ్ సమర్పించలేకపోయినవారు జూలై 31న డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చాక.. ఒకవేళ పేరు మిస్ అయితే, అక్టోబర్ ఒకటి లోపు కొత్తగా దరఖాస్తు (ఫారమ్-8 ద్వారా) చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మొదటిదశలో బీఎల్వోలు ఎలాంటి ఆధార్ లేదా ఇతర పౌరసత్వ/చిరునామా పత్రాలను సేకరించడం లేదని చెప్పారు. కేవలం డిక్లరేషన్ ఫారమ్ తీసుకుంటారని, 2002 జాబితాకు, ప్రస్తుత వివరాలకు పేర్ల స్పెల్లింగుల్లో తేడాలున్నా, వయసులో వ్యత్యాసాలున్నా వాటిని సరిచేయడానికి జూలై 31 తర్వాత నోటీసుల దశలో తగిన పత్రాలతో ఈఆర్వోను కలిసి సరిచేసుకోవచ్చని తెలిపారు. ఓటర్లందరూ బాధ్యతగా తమ ఇంటికి వచ్చే బీఎల్వోలకు సహకరించి, ఫారమ్‌లను పూర్తిచేసి అందించడం ద్వారా తమ ఓటు హకును కాపాడుకోవాలని సూచించారు.
ఇంటి పేరు విషయంలో ఏమి చేయాలి?
ఇంటి పేరు ముందు, వెనుక ఉండటం విషయంలో, ఓటరు కార్డులో పేరు తప్పుగా పడితే ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేస్తే దానిని విచారించి సరిచేస్తారని చెన్నయ్య స్పష్టంచేశారు. ఆన్లైన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని నింపి బీఎల్వోకు ఇవ్వరాదని అన్నారు. చేస్తే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని లేదా బీఎల్వో ఇచ్చిన ఫారాన్ని నింపి ఇవ్వాలని స్పష్టంచేశారు. ‘సర్’ తర్వాత పాత ఓటరు జాబితా ఉండదని, ఇకపై వచ్చేవి కొత్త ఓటరు కార్డులని, అక్టోబర్ ఒకటిన కొత్త ఓటరు జాబితా ప్రకారం ఇస్తారని వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా కొత్తగా ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల, వేర్వేరు రాష్ర్టాల్లో రెండు ఓట్లు ఉన్నా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 18, 19 ప్రకారం.. శిక్షార్హులు అవుతారని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారమ్‌లో ఓటరు డిక్లరేషన్ ఉంటుందని, దానిని చదివి సంతకం పెడుతారు కాబట్టి తప్పించుకోవడానికి వీలుండదని, అందుకే ఓటరు ఏదైనా ఒకచోట మాత్రమే ఎన్యుమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

