దేశమంతా దళితబంధు.. చట్టసభల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్లు : కేసీఆర్
CM KCR | దేశమంతా దళితబంధు ఇవ్వాలి.. ఇదే బీఆర్ఎస్ డిమాండ్ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ.. ‘లాభం ఉన్నకాడి నుంచి పేదలకు ఆదుకోవడం అనేది అనాదిగా భారతదేశ రక్తంలో ఉన్న సంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టిచ్చుడు మన సంప్రదాయం. పేదలను షావుకార్లకు
CM KCR | దేశమంతా దళితబంధు ఇవ్వాలి.. ఇదే బీఆర్ఎస్ డిమాండ్ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ.. ‘లాభం ఉన్నకాడి నుంచి పేదలకు ఆదుకోవడం అనేది అనాదిగా భారతదేశ రక్తంలో ఉన్న సంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టిచ్చుడు మన సంప్రదాయం. పేదలను షావుకార్లకు అప్పజెప్పి సావగొడుతావా? దళితులు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి? అందుకే పుట్టింది దళితబంధు పథకం. అంబేద్కర్, కాన్షీరాం బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. తెలంగాణ దళితబంధు పథకాన్ని సంవత్సరానికి 25లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మీరు చేయకపోతే మేం చేసి చూపిస్తాం. మహిళలను అన్నిరంగాల్లోకి ఆహ్వానించారో.. ఆ దేశాలు బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా.. వంటింట్లోనే ఉండాలి? మేం బలాదూర్‌గా తిరుగుతాం అన్నట్లుగా ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల పాత్రను అన్నిరంగాల్లో పెంపొందించాలి. ఇందులో భాగంగా మహిళలకు 35శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రతిపాదిస్తుంది’ అన్నారు.
అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం
‘దేశంలో మతపిచ్చి లేపుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతున్నాడని, మళ్లీ పబ్లిక్ సెక్టార్లో పెడుతామన్నారు. వ్యవసాయాన్ని సైతం ప్రైవేటీకరణ చేసి మనం భూముల్లో జీతాలకు ఉండే పరిస్థితి ఉండే కుట్ర జరుగుతుంది. జ్ఞానం లేకపోతే.. ఎక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవాలి. ప్రపంచదేశాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. చైనా, సింగపూర్ తదితర దేశాలతో ముందుకువెళ్లాలని కోరుకుంటున్నాం.. అగ్నిపథ్‌ను కూడా రద్దు చేస్తాం. సైన్యంలో జరిగే నియామకాలు పద్ధతి ఉండాలి. సైన్యానికో సిస్టమ్ ఉండాలి. రేపు విపక్షాల ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తుంది. పాత పద్ధతిలోనే కొనసాగిస్తాం. ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో.. తమ అసమర్థతను, చేతగాని తననాన్ని కప్పిపుచ్చుకునేందుకు మత విద్వేషపు మంటలు రేపుతున్నారు.
మనం ఎవరి కోసం ఎందు కోసం సహించాలి? అందరు ఏకమై మూర్ఖుల, అసమర్థ పాలనను తొలగించడం కష్టం కాదు. ఉజ్వలమైన భారత్‌ను ఆవిష్కృతం చేసుకునేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించింది. సంఘీభావం తెలిపిన నేతలకు ధన్యవాదాలు. త్వరలోనే బీఆర్ఎస్ పాలసీని ప్రజల ముందు పెడుతాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు 150 మంది వరకు పనిచేసున్నారు. ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతుంది. త్వరలోనే దేశం ముందు పెడుతాం. ప్రగతిశీల పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పని చేస్తుంది. అంతిమ విజయం మనదే. న్యాయం ధర్మం గెలుస్తుంది’ అన్నారు. పెద్ద ఎత్తున సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

