హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలంగాణ విద్యుత్తు బీ సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, తెలంగాణ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు ప్రకటించారు. పదోన్నతులు సమీక్షించాలన్న డిమాండ్లను జేఏసీ నే తలు పరిగణనలోకి తీసుకోకపోవడం తో స్వచ్ఛందంగా వైదొలుతున్నట్టు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షు డు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భానుప్రకాశ్, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ ప్రకటనలో తెలిపారు.
గాంధీభవన్‌లో ముఖాముఖి ; 320 వినతులు స్వీకరించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తేతెలంగాణ):హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కార్యకర్తలు, ప్రజలతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 దరఖాస్తులను స్వీకరించారు.