Sri Ram Sagar | గోదావరి ప్రాజెక్టులకు జలకళ.. శ్రీరాంసాగర్‌కు పోటెత్తిన వరద
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వచ్చిచేరుతున్నది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది.
హైదరాబాద్: గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వచ్చిచేరుతున్నది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 1,49,995 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పూర్తిస్థాయికి చేరుకుంటున్నది. శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1079.10 అడుగుల వద్ద ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు 49.968 టీఎంసీలు.
కామారెడ్డి (Kamareddy) జిల్లా నిజాంసాగర్ (Nizam sagar) ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కులు వస్తున్నది. జలాశయం 1405 అడుగులుకాగా, ప్రస్తుతం 13972.52 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. కౌలాస్ నాలా ప్రాజెక్టుకు (Kaulas Nala project) 462 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం 456.60 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు.

ఇక నిర్మల్ (Nirmal) జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి (Swarna Project) 9200 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం 1180 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కడెం (Kadem) ప్రాజెక్టుకు వరద పోటిత్తింది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 84,269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ఇప్పుడు 688.22 అడుగులకు చేరింది. జిల్లాలోని గడ్డెన్న జలాశయం (Gaddenna Vagu) పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 358.78 మీటర్లు కాగా, ప్రస్తుతం 358 మీటర్లుగా ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

