అయిజ, అక్టోబర్ 4 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఆనకట్టకు వరద నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 653 క్యూసెక్కులుగా నమోదైంది. ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 353 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ 6.4 అడుగులుగా ఉన్నది.
తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 9,958 క్యూసెక్కులుగా న మోదైంది. డ్యామ్ గరిష్ఠస్థాయి నీటి మ ట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తు తం 1,622.395 అడుగులుగా ఉన్న ట్టు సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.