స్కూల్ ఆటోలు, వ్యాన్లపై నజర్!
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నుంచి స్కూళ్లు, కాలేజీల ఆటోలు, వ్యాన్ల ఓవర్‌లోడింగ్‌పై దృష్టి పెడుతున్నామని రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. బిడ్డల భద్రత లక్ష్యంగా తల్లిదండ్రులు కూడా ఓవర్లోడింగ్ ఆటోలు, వ్యాన్లు, బస్‌ల సమాచారం ఇవ్వాలని కోరారు.
- 165 విద్యాసంస్థల బస్సులపై కేసులు ఫిట్నెస్ లేకపోతే చర్యలు : ఆర్టీఏ
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నుంచి స్కూళ్లు, కాలేజీల ఆటోలు, వ్యాన్ల ఓవర్‌లోడింగ్‌పై దృష్టి పెడుతున్నామని రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. బిడ్డల భద్రత లక్ష్యంగా తల్లిదండ్రులు కూడా ఓవర్లోడింగ్ ఆటోలు, వ్యాన్లు, బస్‌ల సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడేకంటే, ముందస్తుగానే సమాచారం ఇస్తే అటువంటి వాహనాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నదని తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,200కు పైగా వాహనాలు తనిఖీ చేసి, 165 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేశామని, 40 బస్సులు సీజ్ చేశామని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోని విద్యాసంస్థల వాహనాలు త్వరగా ఎఫ్‌సీ తీసుకోవాలని కోరారు. లేకపోతే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

