Protest : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. బీజేపీ డౌన్ డౌన్, ఖబడ్దార్ నరేంద్రమోదీ, బీజేపీ నాయకుల్లారా ఖబడ్ధార్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Hyderabad, Telangana: BRS workers staged a protest against the ED raids conducted at the party MLC K Kavitha’s residence. pic.twitter.com/yeBsAcev45
— ANI (@ANI) March 15, 2024
కాగా, కవిత ఇంటిపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.