ఉత్కంఠగా సాగిన పోటీల్లో మనోళ్లు సత్తాచాటారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో తొలిరోజు మొత్తం 75 ఈవెంట్లు నిర్వహించగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు అథ్లెట్లు బంగారు పతకాలు సాధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగిన పోటీల్లో అన్ని జిల్లాల క్రీడాకారులు దూకుడు ప్రదర్శించి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు.
మొదటిరోజు జరిగిన మొత్తం 75 ఈవెంట్లలో గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులకు మెడల్స్ అందజేసినట్లు ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. (అండర్-14 బాలబాలికల్లో హైజంప్, షాట్‌పుట్‌లో బంగారు పతకాలు, జనగామకు చెందిన కె.సాత్విక్ షాట్‌పుట్‌లో బ్రాంజ్, అండర్-16 300 మీటర్స్ పరుగుపందెంలో) హనుమకొండకు చెందిన జే.రాఘవ(సిల్వర్), పి.సందీప్(బ్రాంజ్), అండర్-16 మిడ్ రిలేలో హనుమకొండకు చెందిన జే.రాఘవ, టి.ప్రవీణ్, బి.వీరభద్రం, జే.అనిల్(సిల్వర్) సాధించారు. అలాగే అండర్-18 లాంగ్‌జంప్‌లో హనుమకొండకు చెందిన బి.అంజి(గోల్డ్), అండర్-20లో 400 మీటర్ల పరుగుపందెంలో బి.కార్తీక్(గోల్డ్), 5వేల మీటర్ల పరుగుపందెంలో ములుగుకు చెందిన ఎం.నగేశ్(సిల్వర్), గర్ల్స్ అండర్-18 జావెలిన్‌త్రోలో ములుగుకు చెందిన మహమ్మద్ కరీష్మా(బ్రాంజ్), గర్ల్స్ అండర్-20లో 100 మీటర్ల పరుగుపందెంలో వరంగల్‌కు చెందిన జే.దీప్తి(గోల్డ్), 10వేల మీటర్లలో జనగామకు చెందిన పన్నీరు ధనుష(సిల్వర్) మెడల్స్ సాధించారు.
స్పోర్టివ్‌గా తీసుకోవాలి
గెలుపే లక్ష్యంగా క్రీడాకారులు పోటీపడాలని, ఓటమితో నిరుత్సాహపడవద్దని స్పోర్ట్స్‌ను స్పోర్టివ్‌గానే తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. క్రీడల నిర్వాహకులను అభినందించారు. ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు వచ్చే నెల 11 నుంచి 15 వరకు అసోం రాష్ట్రం గువాహటిలో జూనియర్ నేషనల్స్‌లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమార్‌యాదవ్, ములుగు జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కైలాస్‌యాదవ్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ ఐలి చంద్రమౌళిగౌడ్, జాయింట్ సెక్రటరీ డి.నాగరాజు, వివిధ విభాగాల కోచ్‌లు వెంకటేశ్వరరెడ్డి, యుగేంధర్‌రెడ్డి, పవన్‌కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
– వరంగల్ సీపీ తరుణ్‌జోషి