హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): విడాకులు పొందిన ముస్లిం ఒంటరి మహిళల నిర్వహణ భత్యానికి సంబంధించి రూ.34.14 లక్షల నిధులను విడుదల చేసినట్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసీవుల్లాఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 342 మహిళలకు 6 నెలలకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్టు చైర్మన్ వెల్లడించారు.