ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉకు కార్మాగారం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
- వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వాలి
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారం నిర్మించాలి
- జిల్లాకో నవోదయ స్కూల్ కావాలి
- ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- మాజీ ఎంపీ బోయినపల్లి డిమాండ్
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉకు కార్మాగారం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని, తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.
బీఆర్ఎస్ ఎంపీలుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంట్లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకున్నామని గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పదిహేను రోజులుగా కేంద్రానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున, రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని డిమాండ్ చేశారు.
విభజన సమస్యల పరిష్కారంలో మోదీ విఫలం
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై దృష్టి పెట్టడంలో పదేండ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందని వినోద్‌కుమార్ విమర్శించారు. మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మోదీ ఐదేండ్ల పాలనకు ఈ బడ్జెట్ పునాది వంటిదని పేర్కొన్నారు. టీడీపీపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తున్నందున ఏపీ కోస్తాతీరంలో 60 వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఏపీకి సీఎం చంద్రబాబు కొంత మేరకు నిధుల కేటాయింపు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

