ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 12: సనాతన ధర్మాన్ని కాపాడడంలో రామానుజాచార్యుల సందేశం నేటి సమాజానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. శనివారం 11వ రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మొదటగా రామానుజాచార్య భారీవిగ్రహాన్ని పరిశీలించడంతో పాటు 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రామానుజాచార్యుల విగ్రహాన్ని దాదాపు 40 ఎకరాలలో నిర్మించి ప్రపంచానికి రామానుజాచార్యుల సందేశాన్ని అందించిన చినజీయర్‌స్వామిని, రామేశ్వర్‌రావును అభినందించారు.
నేడు సమతామూర్తి ఉత్సవాలకు రాష్ట్రపతి
సమతామూర్తి ఉత్సవాలకు ఆదివారం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవుతారని మైహోంగ్రూపు సంస్థల ఎండీ జూపల్లి జగపతిరావు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా ముచ్చింతల్‌కు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పారు.