నిరుద్యోగ భారతం
దేశంలోని దుర్భర పరిస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
- దేశంలో సుమారు 60 లక్షల ఖాళీలు
- కేంద్రంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం
- అసదుద్దీన్ ఒవైసీ వీడియోతో ట్వీట్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగా ణ): దేశంలోని దుర్భర పరిస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. నిరుద్యోగంతో దేశం కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. యూపీలోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎకువగా ఉన్నదన్నారు. దేశంలో ప్రస్తుతం ఇదే బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ ట్వీట్ చేశారు.
దేశంలో సుమారు 60 లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్ది రోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్భంలో తాను చదవి వినిపించిన డాటా తనది కాదని, బీజేపీ ఎంపీ వరుణ్గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డాటాను చదివి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరుణ్‌గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. వరుణ్‌గాంధీ ట్వీట్ చేసిన లెక్కల ప్రకారం కేంద్రంలోని ఖాళీలు పై విధంగా ఉన్నాయి.
| కేంద్రంలోని ఖాళీలు ఇలా.. | |
| శాఖ | ఖాళీగా ఉన్న ఉద్యోగాలు |
| కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు | 9,10,153 |
| ప్రభుత్వ రంగ బ్యాంకులు | 2,00,000 |
| ఆరోగ్య సేవలు | 1,68,480 |
| అంగన్వాడీ టీచర్లు | 1,76,057 |
| కేంద్రియ, నవోదయ విద్యాలయాలు | 16,329 |
| పాఠశాలలు | 8,37,592 |
| కేంద్రీయ విశ్వవిద్యాలయాలు | 18,647 |
| ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ | 16,687 |
| ఇతర కేంద్ర విద్యాసంస్థలు | 1,662 |
| భారత సైన్యం | 1,07,505 |
| సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ | 91,929 |
| పోలీసు | 5,31,737 |
| అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు | 4 |
| హైకోర్టులు | 419 |
| కోర్టులు | 4,929 |
| ఇతర ఖాళీలు | 30,00,000 |
| మొత్తం ఖాళీలు | 60,82,130 |
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bjp mp
- job
- Owaisi
- varun gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

