Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
Sharukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్’ నుంచి తొలి పాట ‘తూ మిల్ జాయే’ను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు.
Sharukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్’ నుంచి తొలి పాట ‘తూ మిల్ జాయే’ను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్నారు. రొమాన్స్, యాక్షన్ అంశాలను కలగలిపి రూపొందించిన ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘తూ మిల్ జాయే’ పాట ప్రారంభంలోనే షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. “నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని” అంటూ ఆయన చెప్పే మాటలతో పాట మొదలవుతుంది. ఆ తర్వాత ప్రకృతి అందాల మధ్య షారుఖ్, దీపికా పదుకొణే మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు కనువిందు చేస్తాయి.
ఇదే సమయంలో ప్రత్యర్థులతో షారుఖ్ తలపడే యాక్షన్ దృశ్యాలను కూడా పాటలో చూపించారు. చివర్లో ఆయన చెప్పే “ఈసారి గుండెల్లో మంట రగిలింది.. ఇప్పుడు ప్రపంచాన్ని తగలబెట్టకుండా ఆగదు” అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మొత్తంగా ఈ పాటలో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌కు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పాటకు సచిన్–జిగర్ సంగీతం అందించారు. అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి తమ గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతర్జాతీయ పాప్ గాయకుడు ఎడ్ షీరన్ ఇంగ్లీష్ ర్యాప్‌తో పాటలో కనిపించడం మరో విశేషం. కుమార్ సాహిత్యం అందించగా, పీయూష్–షాజియా కొరియోగ్రఫీ చేశారు.
షారుఖ్, దీపికా మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలోని సంగీతం, యాక్షన్ దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తొలి పాటతోనే ‘కింగ్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల తర్వాత షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే కలిసి నటిస్తున్న మరో సినిమా ‘కింగ్’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్’ ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా తొలి పాటను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రొమాన్స్, యాక్షన్‌తో కూడిన ఈ చిత్రం వెండితెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

