మషీరాబాద్, అక్టోబర్ 6: మాదిగలను సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నాడని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరచిపోయారని విమర్శించారు.
అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని చెప్పారు. మంగళవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.