రాజ్యసభకు వద్దిరాజు నామినేషన్
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
ఒకే నామినేషన్.. ఎన్నిక ఏకగ్రీవం
రాజ్యసభ అభ్యర్థి దామోదర్‌రావుకు
వెల్లువెత్తిన శుభాకాంక్షలు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మంత్రులు పు వ్వాడ అజయ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, అరూరి రమేశ్, నరేందర్, బిగాల గణేశ్ ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఒక సెట్ సమర్పించారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సయ్యద్ పాషాఖాద్రీ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జోగు రామన్న, కేపీ వివేకానంద మరోసెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, బండా ప్రకాశ్, తాతా మధు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే.
దీవకొండ దామోదర్‌రావుకు శుభాకాంక్షలు

రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు ఇంటివద్ద సందడి నెలకొన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఆయన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సమాచారహక్కు కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టీఆర్ఎస్ నేత గొట్టిముక్కుల కేశవరావు తదితరులు దామోదర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24న నామినేషన్ వేయనున్నట్లు దామోదర్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

