హైదరాబాద్ : ఉర్దూ భాషఎంతో తీయనైనదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉర్దూ మీడియం డిగ్రీ పాఠ్య పుస్తకాలతో పాటు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశ మందిరాల ఆన్ లైన్ బుకింగ్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉర్దూ భాషాభివృద్ధికి, దాన్ని జౌన్నత్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఒకప్పుడు గొప్పగా విలసిల్లిన ఈ భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
అందులో భాగంగా ఉర్దూ భాషను రెండో అధికార భాషగా ప్రకటించారన్నారు.
ముస్లిం మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 204 గురుకుల పాఠశాలలను నడుపుతున్నం. ఉర్దూ మీడియంలో కొనసాగుతున్న 24 డిగ్రీ కాలేజీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ముద్రించి ఉచితంగా అందిస్తున్న అకాడమీ అధికారులను మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్/సెక్రటరీ డాక్టర్ మహ్మద్ గౌస్, అధికారులు రజబలీ పాషా, కృష్ణ, ఇర్ఫాన్ అజీజ్, అతవుల్లా ఖాన్, అధ్యాపకులు అర్షద్ ముబీన్ జుబేరీ, జునేదుల్లా బేగ్, మహమూనా బేగం, జువేరియా ఫాతిమా, అబ్దుల్ ఖుద్దూస్, మహ్మద్ తబ్రేజ్, మహ్మద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.