హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): యూజీ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు రెండేండ్లు వ్యవధి గల బీపీఈడీ కోర్సుకు 965, యూజీ డీపీఈడీ కోర్సుకు 699 మొత్తంగా 1,664 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 13, రూ. 2 వేల ఆలస్య రుసుముతో జూలై 20, రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 27 వరకు అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆగస్టు 22న నిర్వహిస్తామని పేర్కొన్నారు.
30న పాలిసెట్ 365 పరీక్ష కేంద్రాలు, 1.13 లక్షల అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ను ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి 1,13,942 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 365 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని కన్వీనర్ డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు.