వరి విత్తనాలు అమ్మొద్దు
వరి సాగును నియంత్రించేందుకు ఇప్పటికే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొంటున్న ప్రభుత్వం.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. చెట్టు కొమ్మలను కాదు.. చెట్టునే కూకటివేళ్లతో పెకిలించే కుట్రకు తెరతీసింది. అందుకే యాసంగిలో వరి విత్తన విక్రయాలపై అనధికారికంగా బ్యాన్ విధించింది. విత్తనాలను విక్రయించొద్దని డీలర్లకు అల్టిమేటం జారీ చేసింది.
- విత్తన విక్రయాలపై అనధికారికంగా బ్యాన్
- డీలర్లకు వ్యవసాయ శాఖ అల్టిమేటం
- జిల్లాల్లో సమావేశాలు పెట్టి మరీ ఆదేశాలు
- విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిక
- ఇప్పటికే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్
- అదేం లేదని బుకాయిస్తున్న వ్యవసాయ శాఖ
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): వరి సాగును నియంత్రించేందుకు ఇప్పటికే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొంటున్న ప్రభుత్వం.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. చెట్టు కొమ్మలను కాదు.. చెట్టునే కూకటివేళ్లతో పెకిలించే కుట్రకు తెరతీసింది. అందుకే యాసంగిలో వరి విత్తన విక్రయాలపై అనధికారికంగా బ్యాన్ విధించింది. విత్తనాలను విక్రయించొద్దని డీలర్లకు అల్టిమేటం జారీ చేసింది.
ఈ మేరకు జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన డీలర్లతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి మరీ స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. యాసంగిలో ఒక్క గింజ వరి విత్తనాన్ని కూడా విక్రయించొద్దని, ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి విక్రయిస్తే ఆ డీలర్లకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది. అవసరమైతే డీలర్ లైసెన్స్‌ను సైతం రద్దు చేస్తామని హుకుం ఇచ్చినట్టు సమాచారం. సర్కార్ నిర్ణయంపై డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు విత్తనాల కోసం వస్తే విక్రయించకుండా ఎలా ఉంటామని ప్రశ్నిస్తున్నారు. రైతులకు పంట పండించే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నిస్తుండడం గమనార్హం.
రైతులు కావాలంటే.. డిక్లరేషన్ తీసుకోండి
ఒకవేళ రైతులు వరి విత్తనాల కోసం వస్తే వారికి వివరించి చెప్పాలని వ్యవసాయ శాఖ అధికారులు డీలర్లకు సూచించినట్టు తెలిసింది. యాసంగిలో వరి సాగుకు అవసరమైన నీళ్లు ఉండబోవని, కరెంట్ కోతలు సైతం తప్పవని వారికి చెప్పాలని చెప్పినట్టు తెలిసింది. అనవసరంగా వరి సాగు చేస్తే నష్టపోవడం ఖాయమని తేల్చి చెప్పాలని కూడా చెప్పినట్టు తెలిసింది. అయినా రైతులు మాట వినకపోతూ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని పరిమిత సంఖ్యలో విత్తనాలను విక్రయించాలని సూచించినట్టు సమాచారం. వరి సాగు చేస్తే పూర్తి బాధ్యత రైతుదేనని, అన్నింటికి సిద్ధమైతేనే విత్తనాలు విక్రయించాలని స్పష్టం చేసినట్లుగా తెలిసింది.
డిక్లరేషన్ లేదట.. మరి ఇవేంది?
యాసంగిలో వరి సాగుపై కాంగ్రెస్ సర్కార్ కత్తిగట్టిందని, ఒక్క ఎకరం కూడా సాగు కాకుండా కుట్రలు చేస్తున్నదనే విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే వరి సాగు చేసే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని విత్తన డీలర్లకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ‘ఎండితే మా ఖర్మే’ శీర్షికన కథనం ప్రచురించగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, ఇదంతా అవాస్తవమని, అలాంటి ఉత్తర్వులు గానీ, సూచనలు గానీ జారీ చేయలేదని వ్యవసాయ శాఖ ప్రకటించింది. డీలర్లు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నట్టు నమస్తే తెలంగాణ వద్ద ఆధారాలున్నాయి. నల్లగొండలో ఓ డీలర్ రైతు వద్ద డిక్లరేషన్ తీసుకొని విత్తనాలు విక్రయించారు. వరి పంటకు ఏమైనా ప్రభుత్వానికి, డీలర్‌కు సంబంధం లేదనేలా సంతకం తీసుకొని మరీ విక్రయిస్తున్నారు. ఇలా రైతులపై ప్రభుత్వం కక్షగట్టి, కత్తిగట్టి సాగును నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

