దేశమంతా పల్లె ప్రగతి!

తెలంగాణ పల్లెల్లోప్రణాళికాయుతఅభివృద్ధి
దేశవ్యాప్తంగా కార్యక్రమం అమలుకు కృషి
కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడి
ఆర్థికసంఘం నిధులు పెంచండి: ఎర్రబెల్లి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, పంచాయతీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరుగుతున్నదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి దేశమం తా అమలుచేసేలా చూస్తామని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ర్టానికి వచ్చిన కేంద్రమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి, చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం, పంతంగి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణలో పల్లెల సమగ్ర స్వరూపం మారిపోయిందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేస్తూ స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నర్సరీలు, హరితహారం కార్యక్రమం చేపట్టడాన్ని కొనియాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు అవసరమైన ఇండ్ల మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అంతకుముందు కేంద్రమంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల్విండి
స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ద్వా రా అందిస్తున్న గ్రాంటును పెంచాలని కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ను రాష్ట్రమంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు కోరారు. 14వ ఆర్థిక సంఘం తో పోల్చితే 15వ ఆర్థిక సంఘం గ్రాంటు తక్కువగా ఉన్నదన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో కేంద్రమంత్రిని ఎర్రబెల్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వెయ్యి గ్రా మ పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశా రు. ఈ వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని దయాకర్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

