హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, పోలీస్ శాఖకు చెందిన యూనిఫామ్ కాంట్రాక్టును సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చే విషయం పరిశీలిస్తామని చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సచివాలయంలో మంత్రితో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి భేటీ అయ్యారు.
చేనేత కార్మికులకు ఉపాధి, బతుకమ్మ చీరల పంపిణీ సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్మికుల ఉపాధి విషయమై తుమ్మల మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడారు. యూనిఫామ్ కాంట్రాక్టు ఇచ్చినైట్లెతే సిరిసిల్ల చేనేతలకు ఏడాది పొడవునా పనిదొరికి సమస్యలు తీరుతాయని చెప్పారు.