అయిజ, జూలై 7: తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. కర్ణాటకలోని ఎగువన ఉన్న తుంగ నది నుంచి టీబీ జలాశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా వస్తున్నది. తుంగ నది నుం చి శుక్రవారం 16 వేల క్యూసెక్కులను దిగువనున్న టీబీ డ్యాంకు విడుదల చేశారు. టీబీ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 105.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.081 టీఎంసీలకు చేరినట్టు డ్యాం సెక్షన్ అధికారి తెలిపారు. రెండ్రోజుల్లో డ్యాంలోకి భారీగా వరద చేరే అవకాశం ఉన్నదన్నారు. టీబీ డ్యాంకు వరద రాక మొదలు కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాల్సి ఉన్నా సకాలంలో రాకపోవడంతో డ్యాంకు నీటి సామ ర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరద రాక మొదలు కావడంతో కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.