Bhatti Vikramarka | నిరుద్యోగ భృతా.. మేమెప్పుడన్నం?.. అలాంటి హామీ ఇవ్వలేదంటున్న డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మం గళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.
Bhatti Vikramarka | నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు.. నిరుద్యోగ భృతి గురించి మేము ఆరు గ్యారెంటీల్లోగానీ.. ఏ హామీల్లోగానీ చెప్పలేదు. మీరు కావాలంటే మళ్లొక్కసారి వెరిఫై చేసుకొని మాట్లాడండి.
-భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

నిరుద్యోగ యువకులకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతిగా ఇస్తామని మేం మాటిస్తున్నాం. ఇది కేసీఆర్ హామీ ఇచ్చినటువంటి, దానికోసం మీరంతా ఎదురుచూస్తున్నటువంటి భృతి కాదు. ఇది తప్పనిసరిగా నిరుద్యోగులకు అందుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీలైనంత తొందరగా దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం.
– ప్రియాంకగాంధీ
Bhatti Vikramarka | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకదానికి మంగళం పాడింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. దీనికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేవరకు ప్రతి నెల రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ‘నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.4 వేల భృతి ఇస్తాం.
గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయలేదు. కానీ మేము అధికారంలోకి రాగానే వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అందించే ప్రక్రియ ను ప్రారంభిస్తాం’ అని ప్రియాంకగాంధీ స్పష్టం గా చెప్పారు. కానీ.. తాము అలాంటి హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మా ట్లాడుతూ.. ‘నిరుద్యోగ భృతి ఆరు గ్యారెంటీల్లోగా నీ, మ్యానిఫెస్టోలో గానీ చెప్పలేదు’ అని స్పష్టం చేశారు. దీంతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఒక హామీకి మంగళం పాడిందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేవరకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు
ఇదీ ఎన్నికల ముందు 8.5.2౦23న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో విస్పష్టంగా ఇచ్చిన హామీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

